AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..?

Andhra Pradesh Election 2024 LIVE Updates: ఆంధ్రప్రదేశ్‌లోని  25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భారీ బందోస్తు నడుమ పోలింగ్ నిర్వహించనుంది. ఎన్నికల పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.   

Written by - Ashok Krindinti | Last Updated : May 13, 2024, 08:40 PM IST
AP Election 2024 LIVE Voting Updates: ఏపీలో ముగిసిన పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..?
Live Blog

AP Assembly Lok Sabha Election Voting Live Updates: ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఓట్ల పండుగ జరగనుంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించనున్నారు. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4, 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇప్పటికే ఓటర్లు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షలు కాగా.. అందులో పురుషులు 2.3 కోట్లు, మహిళలు 2.10 కోట్లు ఉన్నారు. ఇక థర్డ్‌జెండర్ ఓట్లు 3,421 ఉన్నాయి. సర్వీస్ ఓటర్ల సంఖ్య 68,185గా ఉంది. మొత్తం 1.6 లక్షల ఈవీఎంలను వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.

 

13 May, 2024

  • 20:40 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామని ఏపీ సీఈవో ఎంకే మీనా తెలిపారు. ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని చెప్పారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశామన్నారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారని అన్నారు. అయితే ఈవీఎంలోని చిప్‌లో డేటా భద్రంగా ఉందని.. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించామన్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని.. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని తెలిపారు. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించామన్నారు.

  • 19:15 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటి వారి పాలెంలో ఉద్రిక్తత నెలకొంది. చాగంటి వారిపాలెం ఒక బూత్‌లో మంత్రి అంబటి, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎదురెదురు పడ్డారు. ఈ క్రమంలో అంబటి, కన్నా అనుచరుల మధ్య తోపులాట జరిగింది. కన్నా లక్ష్మీనారాయణకు సంబంధించిన వాహనంపై రాళ్ల దాడి జరిగింది. కన్నా వాహనం  అద్దం ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు. అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితిని అదులపులోకి తీసుకువచ్చారు.

  • 18:16 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: నంద్యాల జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 71.54.

    ==> ఆళ్లగడ్డ : 71.13 శాతం

    ==> బనగానపల్లి   : 70.83 శాతం

    ==> డోన్  : 78.84 శాతం

    ==> నందికొట్కూర్ : 67.24 శాతం

    ==> నంద్యాల : 68.41 శాతం

    ==> శ్రీశైలం : 72.80 శాతం

  • 18:06 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: ఏపీలో సార్వత్రిక ఎన్నికల  పోలింగ్ ముగిసింది. క్యూ లైన్‌లో  ఉన్న  ప్రతి ఒక్కరికి ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా బారులు తీరారు.

  • 17:48 PM

    AP Election 2024 LIVE Voting Updates: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పోలింగ్ నమోదవుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది.

  • 16:34 PM

    AP Election 2024 LIVE Voting Updates: ఏపీలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 4 గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం ఇస్తారు. మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

  • 15:48 PM

  • 15:40 PM

    AP Election 2024 LIVE Voting Updates: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ జోరుగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం పోలింగ్ నమోదైంది.

  • 15:30 PM

    AP Election 2024 LIVE Voting Updates: తెనాలి వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్‌పై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. శివకుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకూ శివకుమార్‍ను గృహ నిర్బంధంలో ఉంచాలని స్పష్టం చేసింది.

  • 15:24 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్‌ నమోదైంది. అన్ని వర్గాల ప్రజలు ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. గ్రామీణంతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున ఓట్లు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉన్నారు.  
     

  • 14:54 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని తొండపి గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. 20 మందికి గాయాలు అయ్యాయి.  భారీగా పోలీసులు మోహరించారు.
     

  • 13:50 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: ఏపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

  • 12:41 PM

  • 12:37 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: పల్నాడులో హింసాత్మక ఘటనలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని అన్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.

  • 12:12 PM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: నంద్యాల జిల్లాలో  మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 28.21.

    ==> ఆళ్లగడ్డ  : 28.58 శాతం
    ==> బనగానపల్లి   : 26.88 శాతం
    ==> డోన్     : 28.21 శాతం
    ==> నందికొట్కూర్ : 28.69 శాతం
    ==> నంద్యాల : 28.66 శాతం
    ==> శ్రీశైలం : 28.22 శాతం

  • 11:57 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: గుంటూరు జిల్లాలో ఉదయం 11 గంటల సమయానికి 20.84 శాతం పోలింగ్ నమోదైంది. తాడికొండలో 21.35 శాతం, మంగళగిరిలో 18.82 శాతం, పొన్నూరులో 22.07, తెనాలిలో 18.55 శాతం, ప్రత్తిపాడులో 22.64 శాతం, గుంటూరు వెస్ట్‌లో 19.1 శాతం, గుంటూరు ఈస్ట్ లో 24.1 శాతం పోలింగ్‌ నమోదైంది.

  • 11:46 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: ఏపీలో భారీగా పోలింగ్ జరుగుతోంది. ఇప్పటివరకు 24 శాతం ఓటింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు.

  • 11:28 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. శివకుమార్ క్యూలో వెళ్లకుండా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆగ్రహానికి గురై శివకుమార్ ఓటరు చెంపపై కొట్టారు. దీంతో ఓటరు కూడా తిరిగి ఎమ్మెల్యే చెంపపై కొట్టాడు. ఈ కాసేపు పోలింగ్ ఆగిపోయింది.

     

  • 10:52 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: నంద్యాల జిల్లాలో  ఉదయం 10 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 11.22.

    ==> ఆళ్లగడ్డ   : 10.68 శాతం
    ==> బనగానపల్లి   : 11.94 శాతం
    ==> డోన్                : 10.44 శాతం
    ==> నందికొట్కూర్ : 10.06 శాతం
    ==> నంద్యాల : 12.42 శాతం
    ==> శ్రీశైలం : 11.50 శాతం

     

  • 10:40 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారకరామా నగర్ యూపీ స్కూల్ 100 పోలింగ్ బూత్ సమీపంలో బూత్ ఏజెంట్ల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలను సముదాయించారు పోలీసులు.

  • 10:36 AM
  • 10:28 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: ఉమ్మడి విశాఖ జిల్లాలో 9 గంటల వరకు జరిగిన  ఓటింగ్ శాతం:

    మొదటి రెండు గంటల్లో 
    విశాఖలో 10:24%
    అనకాపల్లి 8:37%
    అల్లూరి 6:77% 

    నియోజకవర్గాల వారీగా 
    భీమిలి :7.91%
    విశాఖ ఈస్ట్ :9.40%
    విశాఖ వెస్ట్ :11.20%
    విశాఖ సౌత్ :5.12%
    విశాఖ నార్త్ :13%
    గాజువాక :17.23%
    పెందుర్తి:6.59%
    అనకాపల్లి:11.60%
    ఎలమంచిలి :6.91%
    పాయకరావుపేట
    నర్సీపట్నం:6.68%
    చోడవరం :7.92%
    మాడుగుల :11%
    పాడేరు :5'60%
    అరుకు:7%

     

  • 09:20 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: ఏపీలో పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వి.కోట మండలం నర్నేపల్లిలో పనిచేయక పోవడంతో ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నప్పటికీ నిరీక్షణ తప్పడం లేదు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం పాలమంగళం, వరదయ్య పాలెం పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో వరదయ్య పాలెంలో కొందరు ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
     

  • 09:13 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు. భార్యతో కలిసి ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 09:03 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  ముఖేష్ కుమార్ మీనా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో రైల్వే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన 155-సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్‌లో ఓటు హక్కును వేశారు.

  • 09:00 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: విజయవాడలోని రైల్వే కల్యాణ మండపం పోలింగ్‌ కేంద్రంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 08:29 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: అల్లూరి జిల్లా పరిధిలో అరకు నియోజకవర్గం పరిధిలోని హుకుంపేట మండలం మఠం పంచాయతీలో ఈవీఎంలు మొరాయించాయి. పాడేరు నియోజకవర్గం రింతాడ పంచాయతీ రింతాడ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు పని చేయలేదు.

  • 08:03 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: పులివెందులలో సీఎం వైఎస్ జగన్, సతీమణి వైఎస్ భారతి, ఇద్దరు కుమార్తెలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

  • 07:28 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ మొదలైంది. ఐదేళ్లకు ఒసారి పాలకులను ఎన్నుకునే అవకాశం ఇది. అందుకే ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా మీరు వేసిన ఓటు సరిగ్గా పడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 07:19 AM

    AP Assembly Lok Sabha Election Polling Live Updates: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూకడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులకు, వృద్ధులలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.  

Trending News