Vaishnav Tej: కథలు నచ్చక.. సినిమాలు రాక.. అయోమయంలో మెగా మేనల్లుడు

Vaishnav Tej Upcoming Movie: సాయిధరమ్ తేజ్ తమ్ముడిగా, మెగా మేనల్లుడిగా వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఫస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ.. ఈ హీరోకి ఆ తరువాత మాత్రం డిజాస్టర్లు ఎదురయ్యాయి. గత కొంతకాలం నుంచి వెండి తెర మీద కనిపించని వైష్ణవ్ తేజ్.. సినిమాలు చేయడం మానేశారా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 14, 2024, 02:55 PM IST
Vaishnav Tej: కథలు నచ్చక.. సినిమాలు రాక.. అయోమయంలో మెగా మేనల్లుడు

Vaishnav Tej: మెగా కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరోలు ఇండస్ట్రీకి అడుగుపెట్టారు కానీ.. మొదటి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించిన ఘనత మాత్రం సాయి ధరమ్ తేజ్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వైష్ణవ్ తేజ్ కే దక్కింది. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఉప్పెన అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్.

మొదటి సినిమాతోనే 100కోట్ల క్లబ్బులో చేరిపోయి మెగా అభిమానులకి కూడా పెద్ద షాక్ ఇచ్చాడు. ఇంత పెద్ద హిట్ తో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత మాత్రం ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. 

ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ మూడు సినిమాల్లో నటించారు..కానీ మూడూ ఒకదానికి మించి మరొకటి డిజాస్టర్ గా నిలిచాయి. ఇటీవల విడుదలైన ఆదికేశవ సినిమా పరిస్థితి అయితే మరీ దారుణంగా మిగిలింది.
ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో చతికిలబడింది. ఈ సినిమాతో.. ఎందుకు వైష్ణవ్ తేజ్ సరైన సినిమాలు ఎంపిక చేసుకోలేకపోతున్నారు అని అభిమానులు సైతం చర్చించుకోవడం మొదలుపెట్టారు. 

ఒక డైరెక్టర్ కథ చెబుతున్నప్పుడు వినడానికి ఒకలా ఉంటుంది కానీ.. అదే కథ వెండితెర మీదకి వచ్చేసరికి చాలానే మార్పులు జరుగుతూ ఉంటాయి. వినడానికి బాగున్న కథ సినిమాగా తెరకెక్కినప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పగలగడమే కష్టం. కానీ ఆదికేశవ లాంటి సినిమా కథ విన్నప్పుడే ఆ చిత్రం ఎలా తీసిన డిజాస్టర్ అవుతుంది అనేది అర్థమవుతుంది. మరి అలాంటి కథను వైష్ణవి తేజ్ ఎలా ఒప్పుకున్నారని అప్పట్లో చాలానే చర్చలుజరిగాయి.

ఇక స్క్రిప్ట్ సెలక్షన్ మీద సరైన అవగాహన లేకపోవడం వల్లే వైష్ణవ్ తేజ్ కరియర్ ఇలా అయిపోయింది అని కొందరు కామెంట్లు పెట్టసాగారు. ఫస్ట్ సినిమాతో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో మార్కెట్ ప్రతి సినిమాకి తగ్గిపోతూవచ్చింది. ఈ నేపథ్యంలో ఆది కేశవ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ కూడా ఈ విషయాన్ని బాగానే అర్థం చేసుకున్నాడట.  ఈ నేపథ్యంలోనే వైష్ణవ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా స్క్రిప్ట్ సెలక్షన్ లో జరిగిన తప్పులు ఇకపై జరగ కూడదని మెగా మేనల్లుడు బాగానే ప్లాన్ లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందరిలో వైష్ణవి తేజ్ కి ఆఫర్లు రావడం లేదా లేదా కథలు నచ్చకుండా సినిమాలకు దూరంగా ఉంటారా అని అనుమానాలు ఉన్నాయి. అయితే.. కొన్ని ఆఫర్లు వస్తున్నాయి కానీ వైష్ణవి.. మరో డిజాస్టర్ చవిచూసి సాహసం చేయలేక కథల పైన చాలా శ్రద్ధ చూపిస్తున్నట్టు వినికిడి.

Read more: Lady doctor with 2 men: మరో ఇద్దరితో రాసలీలలు.. హోటల్ గదిలో భర్తకు అడ్డంగా దొరికి పోయిన లేడీ డాక్టర్ .. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News