OTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

OTT Releases: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరుగుతోంది. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే వీలుండటంతో ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమాకు ధియేటర్ రిలీజ్, ఓటీటీ రిలీజ్ రెండు తేదీలు ఉంటున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2024, 12:39 PM IST
OTT Releases: ఈ వారం ఓటీటీల్లో భారీగా 22  సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

OTT Releases: ఏదైనా పండుగ సందర్భం వచ్చినా లేదా కొత్త వారం ప్రారంభమౌతున్నా ఓటీటీ ప్రేమికులకు శుభవార్తే. కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతుంటాయి. మరో వారం రోజుల వ్యవధిలో చాలా కొత్త సినిమాలు ఓటీటీలలో స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతున్నాయి. విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, గెటప్ శీను నటించిన రాజు యాదవ్, అపరిచితులు రీ రిలీజ్ ఇలా కొన్ని సినిమాలున్నాయి. ఏ సినిమా లేదా వెబ్‌సిరీస్ ఎందులో విడుదల కానుందో తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్‌లో 

అమెజాన్ ప్రైమ్‌లో ఇంగ్లీషు వెబ్‌సిరీస్ ఔటర్ రేంజ్ సీజన్ 2 మే 16న స్ట్రీమింగ్ కానుండగా, మే 17న 99 ఇంగ్లీషు వెబ్‌సిరీస్ విడుదల కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో

ఇందులో మే 15వ తేదీన ఆష్లే మ్యాడిసన్ సెక్స్ లైస్ అండ్ స్కాండల్ వెబ్‌సిరీస్, బ్లడ్ ఆఫ్ జ్యూయిష్ సీజన్ 2, బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి ఇక మే 16న మేడమ్ వెబ్‌సినిమా, పవర్ సినిమా విడుదల కానున్నాయి. మే 17వ తేదీ నద 8 షో వెబ్ సిరీస్, థెల్మాద యూనికార్న్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. 

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మే 13న క్రాష్ కొరియన్ వెబ్‌సిరీస్, తెలుగు డబ్బింగ్ సినిమా చోరుడు విడుదల కానున్నాయి. మే 14వ తేదీన అంకుల్ సంషిక్ కొరియన్ వెబ్‌సిరీస్, మే 15న బాహుబలి హిందీ యానిమేటెడ్ సిరీస్ ప్లే కానున్నాయి. 

జీ 5లో

జీ5లో మే 17వ తేదీన బస్తర్ ది నక్సల్ స్టోరీ హిందీ సినిమా, తళమై సెయలగమ్ తమిళ వెబ్‌సిరీస్ విడుదల కానున్నాయి. 

జియో సినిమాలో

జియో సినిమాలో మే 13న డిమోన్ స్లేయర్ వెబ్‌సిరీస్, C.H.U.E.C.O సీజన్ 2 స్పానిష్ వెబ్‌సిరీస్, మే 14న జర హట్కే జర బచ్కే హిందీ సినిమా విడుదల కానున్నాయి.

ఇక సోనీలివ్‌లో మే 16వ తేదీన మరాఠీ వెబ్‌సిరీస్ లంపన్ స్ట్రీమింగ్ కానుంది. బుక్ మై షోలో మే 17న గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, మే 13న ద న్యూ ఎంపైర్ తెలుగు డబ్బింగ్ సినిమా స్ట్రీమింగ్ కానున్నాయి. 

Also read: IMD Southwest Monsoon 2024: ఈసారి నైరుతి రుతు పవనాలు ఎప్పుడు, ముందుగానా, ఆలస్యమా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News