Trisha Krishnan: మలయాళంపై త్రిష కన్ను.. ఏకంగా ఆ హీరోతో జోడి కట్టనున్న హీరోయిన్

Trisha Upcoming Movies : చాలా కాలం క్రితం మలయాళం లో ఒక సినిమా చేసి మళ్లీ వెనక్కి వచ్చేసిన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్.. ఇప్పుడు మళ్ళీ మలయాళం ఇండస్ట్రీలో తన సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి రెండు సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది త్రిష. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 13, 2024, 09:45 PM IST
Trisha Krishnan: మలయాళంపై త్రిష కన్ను.. ఏకంగా ఆ హీరోతో జోడి కట్టనున్న హీరోయిన్

Trisha Malayalam Movie : ఎప్పుడో 1999లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష కృష్ణన్ 2002లో హీరోయిన్ గా తన కెరియర్ ను మొదలు పెట్టింది. 22 ఏళ్ల తర్వాత కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండగలగడం కేవలం త్రిష కే సొంతం. అటు తెలుగు ఇటు తమిళ్ ఇండస్ట్రీలలో త్రిష వరుస సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడూ తెలుగు డబ్బింగ్ సినిమాలతో కూడా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తుంది. 

ముఖ్యంగా త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న త్రిష అటు హిందీ ఇటు మలయాళం అవకాశాలు కూడా అందుకుంటుంది. 40 ఏళ్ల వయసులో కూడా త్రిష ఇన్ని భాషల నుంచి అవకాశాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష ఈ రేంజ్ లో అవకాశాలు అందుకోవడం.. అభిమానులలో సైతం షాక్ కి గురిచేస్తుంది. 

ప్రస్తుతం త్రిష మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. రామ్ అనే సినిమాలో మోహన్ లాల్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న త్రిష మరోవైపు టోవినో థామస్ హీరోగా నటిస్తున్న ఐడెంటిటీ సినిమాలో కూడా నటిస్తోంది. నిజానికి చాలా ఏళ్ల క్రితమే త్రిష మలయాళం లో నివిన్ పాలీ సరసన హే జూడ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా ఆడక పోవడంతో ఆమెకి పెద్దగా ఆఫర్లు రాలేదు. కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాలు హిట్ అయితే కచ్చితంగా త్రిషకి మలయాళం నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తాయి. ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకోవాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది త్రిష.

మరోవైపు తమిళ్లో కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధగ్ లైఫ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో కూడా నటిస్తోంది.

Also Read: Himanshu Rao: తొలిసారి ఓటు వేసిన మాజీ సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు రావు

Also Read: AP Elections High Tension: పోలింగ్‌ రోజు ఆంధ్రప్రదేశ్‌లో రచ్చరచ్చ.. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలతో చాలాచోట్ల ఉద్రిక్తత

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News