IMD Southwest Monsoon 2024: ఈసారి నైరుతి రుతు పవనాలు ఎప్పుడు, ముందుగానా, ఆలస్యమా

Southwest Monsoon: వేసవి తీవ్రంగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్న పరిస్థితి. అప్పుడే మే నెలలో సగం రోజులైపోవస్తున్నాయి. ఇక నైరుతి రుతు పవనాల రాకపై అంచనాలు మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 14, 2024, 12:05 PM IST
IMD Southwest Monsoon 2024: ఈసారి నైరుతి రుతు పవనాలు ఎప్పుడు, ముందుగానా, ఆలస్యమా

Southwest Monsoon: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. గత 4-5 రోజులు తప్ప ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ వాతావరణం పూర్తిగా వేడెక్కిపోయింది. ఓ వైపు భారీగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోయారు. మే నెల కూడా దాదాపు సగం రోజులు పూర్తవడంతో ఇక నైరుతి రుతు పవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయనే అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ నుంచి శుభవార్తే అందుతోంది.

గత ఏడాది నైరుతి రుతు పవనాల విషయంలో ఎదురైన నైరాశ్యం, రైతుల అగచాట్లు అందరికీ తెలిసిందే. గత ఏడాది నైరుతి రుతు పవనాలు చాలా ఆలస్యంగా ప్రవేశించాయి. పూర్తిగా ప్రవేశించాక కూడా చలనం లేకుండా స్తబ్దుగా ఉండిపోవడంతో వర్షాలు చాలా ఆలస్యమయ్యాయి. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి ఎండలు మండిపోతున్నాయి. భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం విలవిల్లాడారు. దేశవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ క్రమంలో ఈసారి నైరుతి రుతు పవనాల రాక విషయంలో ఐఎండీ గుడ్ న్యూస్ అందించింది. ఈసారి 3 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు సముద్రంలో ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 22వ తేదీన కాకుండా మే 19న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించి అక్కడ్నించి వారం  పదిరోజుల్లో కేరళను తాకనున్నాయి. అంటే మే 29 లేదా 30 తేదీల్లో నైరుతి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. 

సాధారణంగా నైరుతి రుతు పవనాలు సకాలంలో ప్రవేశించాలంటే అరేబియా సముద్రంలో అనుకూలమైన పరిస్థితులుండాలి. ముఖ్యంగా అల్పపీడనం, వాయుగుండం వంటి ఆటంకాలు ఉండకూడదు. వీటివల్ల రుతు పవనాల రాక ఆలస్యమౌతుంది. ఈ నెలాఖరులో కూడా అరేబియా సముద్రంలో ఆ పరిస్థితి కన్పిస్తున్నా నిర్ధారణయ్యేందుకు ఇంకా పది రోజులు పడుతుందంటున్నారు. గత ఏడాది కూడా మే 19న నైరుతి రుతు పవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో ప్రవేశించినా ప్రతికూల పరిస్థితుల కారణంగా కేరళ రావడంలో ఆలస్యమై ఏకంగా జూన్ 8వ తేదీ తరువాత ప్రవేశించాయి. అ తరువాత కూడా అవి చలనం లేకుండా ఉండటంతో వర్షాలు తక్కువ కురిశాయి. 

ప్రస్తుతం దక్షిణ కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది. మరోవైపు మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో రానున్న మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు పడవచ్చు.

Also read: AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News