ఉత్తరాంధ్రలో మళ్లీ ఆంత్రాక్స్ కలకలం..!

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఆంత్రాక్స్ నీడ కమ్ముకుంది.

Updated: Feb 12, 2018, 07:21 PM IST
ఉత్తరాంధ్రలో మళ్లీ ఆంత్రాక్స్ కలకలం..!
Representational Image

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఆంత్రాక్స్ నీడ కమ్ముకుంది. విశాఖ జిల్లా చింతపల్లి మండలం పెదపాకల ప్రాంతంలో కొందరు గిరిజనులు గత కొద్ది రోజులుగా చర్మ సంబంధిత, శ్వాసకోశ వ్యాధులతో  బాధపడుతుండగా వారిని స్థానిక మండల ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్య శాఖాధికారికి అనుమానం వచ్చి.... విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి వారిని రిఫర్ చేశారు.

కేజీహెచ్  ఆసుపత్రిలో ఆ రోగులను పరిశీలించిన డాక్టర్లు వారికి ఆంత్రాక్స్ రోగం ఉన్నట్లు నిర్థారించారు. గిరిజనులు చనిపోయిన గోమాంసాన్ని భక్షించడంతో ఆ వ్యాధి సోకిందని తమ ఎంక్వయరీలో  తేలిందని వైద్యశాఖాధికారులు తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని గిరిజన ఏజెన్సీల్లో ప్రతీ రోజు ఆరోగ్య అవగాహన శిబిరాలను నిర్వహించాలని యోచిస్తున్నట్లు,  అదనపు వైద్యపరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.