పోలవరం గ్యాలరీ వాక్‌ ప్రారంభోత్సవం : ఉద్వేగానికి గురైన చంద్రబాబు

 పోలవరం గ్యాలరీ వాక్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్వేగానికి గురైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

Updated: Sep 13, 2018, 12:42 PM IST
పోలవరం గ్యాలరీ వాక్‌ ప్రారంభోత్సవం : ఉద్వేగానికి గురైన చంద్రబాబు

పోలవరం గ్యాలరీ వాక్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం ప్రారంభించారు. గ్యాలరీ వాక్ ప్రారంభోత్సవం సందర్భంగా గ్యాలరీ వాక్‌లోంచి నడుచుకుంటూ వెళ్లిన ఆయన అనంతరం తన అనుభవాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. గ్యాలరీ వాక్ సందర్భంగా ఎంతో ఉద్వేగానికి గురైన చంద్రబాబు నాయుడు.. తన జీవితంలో ఇవి మరువలేని క్షణాలు అంటూ తన మధురానుభూతిని వ్యక్తపరిచారు. నాడు దీనికి నేనే శంకుస్థాపన చేశాను.. నేడు గ్యాలరీ వాక్ చేశాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.

 

 

చంద్రబాబు పోలవరం పర్యటనలో ఆయన సతీమణీ నారా భువనేశ్వరి, కొడుకు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణీ, మనవడు దేవాన్షు కూడా పాల్గొన్నారు.

Andhra-pradesh-CM-Chandrababu-Naidu-at-Polavaram-gallery-walk-Inauguration