నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం షెడ్యూల్!

నేడు హైదరాబాద్‌లో 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం! 

Last Updated : Dec 2, 2018, 04:11 PM IST
నేడు 3 నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం షెడ్యూల్!

హైద‌రాబాద్ : ఈ నెల 7న తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం మహాకూటమి తరపున ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ ముఖ్యమంత్రి చందబ్రాబు నాయుడు నిన్న శనివారం రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ కూడా చంద్రబాబు హైదరాబాద్‌లోని మూడు నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు. మొదట మలక్‌పేట నియోజకవర్గం నుంచి ప్రారంభం కానున్న చంద్రబాబు ప్రచారం, ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం మీదుగా కొనసాగి సాయంత్రానికి ఉప్పల్‌ నియోజకవర్గంలోని ఈసీఐఎల్ ఎక్స్ రోడ్‌తో ముగియనుంది. మధ్యాహ్నం 1:30 గంటలకు మలక్‌పేటలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓరియంట్‌ మెడికల్‌, మధ్యాహ్నం 2:15 పంచశీల గ్రంథాలయం, మ.3:30 గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. 

సాయంత్రం  4:30 గంటలకు ఎల్‌బీనగర్‌లోని చైతన్యపురి చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి సాయత్రం 5:45 గంటలకు ఉప్పల్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి హబ్సిగూడ చౌరస్తా‌, నాచారం చౌరస్తా‌, మల్లాపూర్‌ చౌరస్తా‌, మౌలాలి హెచ్‌బీ కాలనీ మీదుగా ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్‌ వరకు కొనసాగనుంది. రాత్రి 9:30 నుంచి 10 గంటల ప్రాంతంలో ఈసీఐఎల్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద చంద్రబాబు రోడ్ షో ముగియనుంది.

Trending News