కథువా, ఉన్నావ్ ఘటనలపై స్పందించిన చంద్రబాబు

కథువా, ఉన్నావ్ అత్యాచార బాధితులకు న్యాయం జరుగాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

Updated: Apr 16, 2018, 04:29 PM IST
కథువా, ఉన్నావ్ ఘటనలపై స్పందించిన చంద్రబాబు

కథువా, ఉన్నావ్ అత్యాచార బాధితులకు న్యాయం జరుగాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో అనేకచోట్ల వేల మంది ఆందోళనకారులు తమ ఈ ఉదంతాలపై నిరసనలు తెలియజేస్తున్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టుతున్నారు. వాళ్లూ వీళ్లూ అనికాకుండా అందరూ బాధితులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలతో పాటు ఇతర ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో ఈ ఘటనలపై స్పందిస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కథువా, ఉన్నావ్ ఘటనలపై స్పందించారు. 'కథువా, ఉన్నావ్ దుర్ఘటనలు మానవత్వానికే మాయనిమచ్చ. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలి. నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి' అని  చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.