అమిత్ షాను జగన్ దేవుడిలా కొలుస్తున్నారు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Updated: May 13, 2018, 11:04 AM IST
అమిత్ షాను జగన్ దేవుడిలా కొలుస్తున్నారు!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను జగన్‌ దేవుడిలా కొలుస్తున్నారని.. ఆయన కాన్వాయ్‌పై జరిగిన దాడిని ఏదో జరిగినట్లు చెబుతున్నాడని మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కర్ణాటకలో బీజేపీకి వైసీపీ నాయకులు ప్రచారం చేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కడపలో డబ్బులు తీసుకెళ్లి కర్ణాటకలో పంచారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో విజయ్‌సాయి స్వయంగా డబ్బులు పంచారన్న మంత్రి.. జగన్‌ కేంద్రంతో లాలూచీ పడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు.

మరో మంత్రి యనమల మాట్లాడుతూ, జగన్‌కు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకొని తింటారని, ఏపీని బీజేపీకి తాకట్టు పెడతారని విమర్శించారు. కేవలం 5ఏళ్లలో రూ.లక్ష కోట్లు దోచుకున్న జగన్.. తన కేసులు మాఫీ చేయించుకోడానికి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో ‘గాలి’ గ్యాంగ్‌కు వైసీపీ పార్టీ ప్రచారం చేయలేదా..? అని యనమల ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడానికి మళ్లీ ఏకం అవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యనమల సూచించారు.