9 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

స్కూళ్లకు 13రోజులు దసరా సెలవులు

Updated: Oct 7, 2018, 09:29 AM IST
9 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈనెల 9 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. 13 రోజుల సెలవుల అనంతరం స్కూళ్లు 22న పునఃప్రారంభం అవుతాయన్నారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా రాష్ట్రంలోని స్కూళ్లలో ప్రస్తుతం జరుగుతున్న సమ్మెటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షలు ఈ నెల 8తో (సోమవారం) ముగియనున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా..

ఏపీలో కూడా అక్టోబర్ 9 నుంచే పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు ఏపీ విద్యాశాఖ అధికారులు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి 22వ తేదీన పాఠశాలలు ప్రారంభం అవుతాయన్నారు. సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సంవత్సరంలో అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 21వ తేదీన ఆదివారం కావడంతో పాఠశాలలన్నీ 22వ తేదీన సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close