బీజేపీకి కాంగ్రెస్‌కి తేడా అదే : పురందేశ్వరి

బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి లేదు : పురందేశ్వరి

Last Updated : Jun 18, 2018, 08:24 PM IST
బీజేపీకి కాంగ్రెస్‌కి తేడా అదే : పురందేశ్వరి

దేశవ్యాప్తంగా మొత్తం 1700 పార్టీలు ఉండగా ప్రసుతం అన్ని పార్టీల్లోనూ వారసత్వ రాజకీయాలే కొనసాగుతున్నాయని, అయితే, కేవలం బీజేపీలో మాత్రం అటువంటి పరిస్థితి లేదని అన్నారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురందేశ్వరి మాట్లాడుతూ "కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పక్కకు తప్పుకున్న వెంటనే ఆ స్థానంలోకి రాహుల్‌ గాంధీ వచ్చి చేరడమే వారసత్వ రాజకీయాలకు చక్కటి ఉదాహరణ" అని అభిప్రాయపడ్డారు. 

వారసత్వ రాజకీయాల విషయంలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి మరిన్ని వ్యత్యాసాలు వివరిస్తూ.. "భవిష్యత్‌లో మీలో ఎవరైనా జాతీయ అధ్యక్షుడి పదవి చేపట్టవచ్చంటూ, ప్రభుత్వం అత్యున్నత పదవులు పొందే అవకాశం ఉంటుంది కానీ కాంగ్రెస్‌లో అయితే అటువంటి పరిస్థితి ఉండదు" అని తెలిపారామె. ప్రస్తుత ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి లాంటి చాలా మంది వ్యక్తులు అలా మీలో ఒకరిగా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వారేనంటూ పురందేశ్వరి గుర్తుచేశారు.

Trending News