బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు.

Updated: Apr 17, 2018, 11:07 AM IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి కంభంపాటి రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు పంపారు. హరిబాబు గత నాలుగేళ్లుగా ఏపీ భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. నాలుగేళ్లుగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించారన్నారు.

ఇటీవల బీజేపీతో తెదేపా తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బలపడాలని ఆ పార్టీ యోచిస్తోంది. అందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడిగా హరిబాబును తప్పించి సమర్థుడైన మరో నేతకు కట్టబెట్టాలని అధిష్ఠానం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

కాగా మరో మూడు, నాలుగు రోజుల్లో కొత్త కమిటీ ఏర్పాటయ్యే అవకాశం ఉందని, ఏపీకి కొత్త అధ్యక్షుడి నియామయం ఉంటుందని తెలిసింది. వీరిలో ప్రముఖంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేరు గట్టిగా వినిపిస్తోంది. అలానే సోము వీర్రాజు, కన్నా లక్ష్మిణారాయణల పేర్లను కూడా  అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి.