బీజేపీ,టీడీపీ రిలేషన్స్ పై జేసీ హాట్ సెటైర్

 కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న టీడీపీ ఇంకా ఎన్డీఏ భాగస్వామ్యంలో కొనసాగడంపై కూడా జేసీ దివాకర్ రెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు

Updated: Mar 13, 2018, 04:13 PM IST
బీజేపీ,టీడీపీ రిలేషన్స్ పై జేసీ హాట్ సెటైర్

వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో స్పందించడంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ ముందే వుంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఆగ్రహంతో కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకున్న టీడీపీ ఇంకా ఎన్డీఏ భాగస్వామ్యంలో కొనసాగడంపై కూడా జేసీ దివాకర్ రెడ్డి తనదైన స్టైల్లోనే స్పందించారు. పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎలాగైతే రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చిన తర్వాత కూడా తమ సంతానం కోసం అప్పుడప్పుడూ కలుస్తున్నారో.. అలాగే ఆంధ్రప్రదేశ్ జనం కోసం టీడీపీ కూడా కేంద్రంతో కలిసి ముందుకెళ్తోంది అని అన్నారు జేసీ దివాకర్ రెడ్డి. 

కేవలం ఆంధ్రా ప్రయోజనాల కోసమే టీడీపీ ఇంకా ఎన్డీఏలో కొనసాగుతోంది అని ఈ సందర్భంగా జేసీ స్పష్టంచేశారు. కేంద్రంతో టీడీపీ బంధాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.