చంద్రబాబు స్వీట్ ట్వీట్‌‌ ; కేటీఆర్ హాట్ కౌంటర్

Updated: Mar 14, 2018, 07:55 PM IST
చంద్రబాబు స్వీట్ ట్వీట్‌‌ ; కేటీఆర్ హాట్ కౌంటర్

ట్విట్టర్ వేదికగా తెలంగాణ అంశాన్ని లేవనెత్తిన చంద్రబాబు ట్వీట్ పై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే.. ఏపీకి స్పెషల్ స్టేటస్ అంశంపై జైట్లీ మాట్లాడుతూ సెంటిమెంట్ ఆధారంగా నిధులు రావని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.  జైట్లీ వ్యాఖ్యలకు ఏపీ సీఎం చంద్రబాబు బదులిస్తూ.. సెంటిమెంట్ ఆధారంగానే తెలంగాణ వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని ట్వీట్ చేశారు.

చంద్రబాబు కామెంట్స్ పై తెలంగాణ మంత్రి  కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన ట్వీట్ పై ఆయన స్పందిస్తూ తమ పోరాటాన్ని చంద్రబాబు తక్కువ చేసి చూపించడం తగదని హితవుపలికారు. కేటీఆర్ మాట్లలో చెప్పాలంటే..ఏపీ హక్కుల కోసం పోరాడటంలో తప్పులేదు.. కానీ తెలంగాణ ప్రజల పోరాటాన్ని.. త్యాగాలను తక్కువ చేసి మాట్లాడొద్దు.. మేము మీలాగా ప్యాకేజీల కోసం రాష్ట్రాన్ని కోరుకోలేదు.. అది మా హక్కు’ అని చంద్రబాబుకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.