ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

Updated: Oct 9, 2018, 09:47 AM IST
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. అంతర్జాతీయ వ్యవసాయ విధాన నాయకత్వ పురస్కారం-2018 (గ్లోబల్‌ అగ్రికల్చర్‌ పాలసీ లీడర్‌షిప్‌ అవార్డు 2018)కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపికయ్యారు. వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ ఎంఎస్‌ స్వామినాథన్‌ అధ్యక్షతన నియమించిన జ్యూరీ కమిటీ ఈ అవార్డు ఎంపిక నిర్వహించింది. ఈ నెల 24న ఢిల్లీలోని హయత్‌ రీజెన్సీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

ఏపీలో వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు, గ్రామీణ ప్రాంతాల ప్రగతి కోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి, ఆయన విజన్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ నాయకత్వ పురస్కారానికి ఎంపిక చేసినట్లు భారత ఆహార, వ్యవసాయ మండలి(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్- ఐసీఎఫ్ఏ‌) సోమవారం ప్రభుత్వానికి పంపిన సందేశంలో తెలిపింది. కాగా ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. 

వ్యవసాయ రంగంలో విధానాలు, పరిశ్రమ, పరిశోధన, అభివృద్ధి నాయకత్వం తదితర 15 రకాల కేటగిరీల్లో ఈ అవార్డులను అందజేస్తారు.

పాలసీ లీడర్‌ షిప్‌ అవార్డుకు.. 2015లో ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేశ్‌ యాదవ్, 2016లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, 2017లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పురస్కారాలు అందుకున్నారు. 2018 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అందుకోనున్నారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close