ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగినప్పుడే ప్రజలు హర్షిస్తారు - రఘువీరా

 మోడీ కేబినెట్ నుంచి  టీడీపీ వైదొలగడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది.  

Updated: Mar 8, 2018, 06:44 PM IST
 ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగినప్పుడే ప్రజలు హర్షిస్తారు - రఘువీరా

కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలగడాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఆహ్వానించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పీసీసీ చీఫ్ రఘువీరా మాట్లాడుతూ మోడీ కేబినెట్ నుంచి టీడీపీ వైదొలగడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో వెళ్తే ఓటమి తప్పదనే భయంలో టీడీపీ ఈ పనిచేసిందన్నారు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ సర్కార్ తో టీడీడీ పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బీజేపీ టీడీపీల మధ్య ఇంకా బేరసారాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఎన్డీయేతో పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకుంటేనే ప్రజలు హర్షిస్తారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి ఢిల్లీ వచ్చి పోరాడితే ఫలితం ఉంటుందని పీసీసీ చీఫ్ రఘువీరా అభిప్రాయపడ్డారు.