చంద్రబాబు ఆలోచనలు ఆచరణ సాధ్యమా !

రాజధాని నిర్మాణ పనుల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై సీపీఐ నారాయణ స్పందించారు.

Updated: Jan 11, 2018, 08:15 PM IST
చంద్రబాబు ఆలోచనలు ఆచరణ సాధ్యమా !

అమరావతి నిర్మాణంలో చంద్రబాబు ఆలోచన అద్భుతంగా ఉందని..అయితే అవి ఆచరణలో సాధ్యకాక పోవచ్చని సీపీఐ నారాయణ అభిప్రాయపడ్డారు. గురువారం నారాయణ తన సహచర సీపీఐ నేతలతో కలిసి ఏపీ సచివాలయాన్ని చూసేందుకు సైకిల్ పై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో ముచ్చటించారు. ‘చంద్రబాబు ప్లాన్ అయితే బాగుంది.. రోడ్లు దీర్ఘకాలికంగా ఉండేలా వేస్తున్నారు.. ఆయన ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం సాధ్యం కాకపోవచ్చు.. ’ అని వ్యాఖ్యానించారు.