షీటు తారుమారు..వైద్యం వికటించి రోగి మృతి

ఒకరికి చేయాల్సిన చికిత్సను మరొకరికి చేయడంతో రోగి మృతిచెందాడు. 

Updated: Jan 1, 2018, 06:13 PM IST
షీటు తారుమారు..వైద్యం వికటించి రోగి మృతి

కర్నూలు: ఒకరికి చేయాల్సిన చికిత్సను మరొకరికి చేయడంతో రోగి మృతిచెందాడు. ఈ ఘటన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగింది. కేసు షీట్ తారుమారుకావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కనీసం పెద్ద చదువులు చదువుకున్న వైద్యులు కూడా ఇది గమనించక ఒకరి చేయాల్సిన వైద్యాన్ని మరొకరికి చేశారు.

దీంతో వైద్యం వికటించి భీమన్న అనే రోగి మృతిచెందాడు. సోమవారం జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. మృతుడి తరుఫు బంధువులు శవాన్ని ఆసుపత్రి ఎదుట పెట్టుకొని బైఠాయించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేయడంతో.. ఆసుపత్రి ఆవరణ మొత్తం హోరెత్తింది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.