కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్‌ ఎండీ డా.బోళ్ల బుల్లిరామయ్య (91) మృతి చెందారు.

Updated: Feb 14, 2018, 01:32 PM IST
కేంద్ర మాజీమంత్రి బోళ్ల బుల్లిరామయ్య కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, తణుకు ఆంధ్రా షుగర్స్‌ ఎండీ డా.బోళ్ల బుల్లిరామయ్య (91) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం మరణించారు. 1926 జులై 9న తూర్పుగోదావరి జిల్లా తాటిపాకలో జన్మించిన ఆయన ఏలూరు నుండి 8వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తరువాత ఇదే లోక్‌సభ స్థానం నుంచి తొమ్మిది, పది, పన్నెండవ లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 1996-98 కాలం మధ్య బుల్లి రామయ్య కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.