చంద్రబాబు చూపు కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ వైపు ?

Last Updated : Mar 8, 2018, 09:33 PM IST
చంద్రబాబు చూపు కేసీఆర్ థార్డ్ ఫ్రంట్ వైపు ?

ఎన్డీయే కూటమితో దాదాపు సంబంధాలు తెంచుకున్న చంద్రబాబు..ఇప్పుడు జాతీయ స్థాయిలో మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తమ మద్దతిచ్చే వారి విషయంలో క్లారిటీ వచ్చిన తర్వాతే చంద్రబాబు ఎన్డీయే కూటమితో తెగదెంపులు చేసుకుంటారని రాజకీయావర్గాల నుంచి సమాచారం. 

కేసీఆరే చంద్రబాబుకు దిక్కు 

ఇప్పటి కిప్పుడు చంద్రబాబుకు మద్దతిచ్చేదెవరు అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు.. కేసీఆరే ఆయనకు ఫస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నారు.  ఎందుకుంటే ఇటీవలే కేసీఆర్ నోట థార్డ్ ఫ్రంట్ మాట వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నారు. పైగా ప్రత్యేక హోదాపై ఆయన ఎలాంటి వ్యతిరేకత కనబరచలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కేసీఆర్ తో జతకట్టి థార్డ్ ఫ్రంట్ కు రూపం ఇస్తారనే ఊహాగానాలు విపినిస్తున్నాయి.

భూస్తాపితం చేసిన వారితో స్నేహమా ?
అయితే తెలంగాణలో టీడీపీని భూస్తాపితం చేసిన కేసీఆర్ తో చంద్రబాబు దోస్తీ చేయడం అసాధ్యమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుత పరిణామాలు థార్డ్ ఫ్రంట్ బలపడటానికి అనుకూల వాతావరణం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో థార్డ్ ఫ్రంట్ పై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.

Trending News