కాదనలేని సత్యం; కరుణానిధి మన తెలుగింటి బిడ్డే !!

                                

Last Updated : Aug 8, 2018, 07:09 PM IST
కాదనలేని సత్యం; కరుణానిధి మన తెలుగింటి బిడ్డే !!

ద్రవిడ ఉద్యమ నేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి ఇక లేరు...ఈ మాట వినడానికే గుండె తరుక్కుపోతుంది కదూ.  తిరిగి రాని లోకాలకు వెళ్లిన జనహృదయ నేతకు సంబంధించిన బహిరంగ రహస్యం ఒకటి ఈ సందర్భంగా తెలుసుకుందామా. కరుడుగట్టిన రాజకీయవాదిగా, ద్రవిడ ఉద్యమకారుడిగా పేరుగాంచిన దివంతగత నేత కరుణానిధికి తెలుగు జాతి మూలాలున్నాయట. నమ్మసక్యంగా లేకపోయినా ఇది అక్షర సత్యం. దీనికి గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

జనహృదయ నేత, ద్రవిడ ఉద్యమకారుడిగా పేరుగాంచిన కరుణానిధి తెలుగింటి బిడ్డ. 1924 జూన్‌ 3న తంజావూరులో ముత్తువేల్‌, అంజుగం దంపతులకు జన్మించిన కరుణానిధి పూర్వీకులది ప్రకాశం జిల్లా.. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు  దక్షిణామూర్తి. అనంతరం ఆయన్ను కరుణానిధిగా పిలవడం మొదలెట్టారు. కరుణకు సంబంధించిన ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏది ఏమైనప్పటికి కరుణానిధి ( దక్షిణామూర్తి) తగ్గట్టుగానే  ఆయన ఉద్యమకారుడిగాను...కరుడుగట్టిన రాజకీయవాదిగాను దక్షిణాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Trending News