టెట్ పరీక్ష పూర్తయిన మరుక్షణమే ఫలితం వెల్లడి!

ఈ నెల 10 నుంచి 21వరకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్షలు జరగనున్నాయి.

Updated: Jun 8, 2018, 01:02 PM IST
టెట్ పరీక్ష పూర్తయిన మరుక్షణమే ఫలితం వెల్లడి!

ఈ నెల 10 నుంచి 21వరకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ సంస్థ ఏపీ ఆన్ లైన్  భాగ‌స్వామ్యం తోనే టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. కాగా ఆన్‌లైన్‌లో ఏపీ టెట్ నిర్వహిస్తున్న విద్యాశాఖ ఇప్పుడు పరీక్ష పూర్తవగానే కంప్యూటర్ తెరపై మార్కులను తొలిసారిగా చూపించనుంది. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు ప్రశ్నాపత్రం సబ్‌మిట్ చేయగానే కంప్యూటర్ తెరపై వారికి ఎన్ని మార్కులు వచ్చాయో కనిపిస్తుంది. ఇక పరీక్ష మరుసటి రోజు మొబైల్ ఫోన్‌కు మార్కులు పంపించనుంది.

మరోవైపు పేపర్, సబ్జెక్టు, భాష మార్చుకునేందుకు అభ్యర్థులకు మరోసారి ఇచ్చిన అవకాశ గడువు నేటి సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. అభ్యర్థులు టెట్ వెబ్‌సైట్‌లో ఉంచిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం వివరాలను నింపి దరఖాస్తును స్కానింగ్ చేసి మెయిల్ చేయాలని కన్వీనర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ అభ్యర్థులకు ఆయా జిల్లా పరీక్షా కేంద్రాల్లోని పరిమితిని బట్టి కేంద్రాలను కేటాయిస్తామని వెల్లడించారు.

ఏపీ టెట్ హాల్ టికెట్లను aptet.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వెబ్‌సైట్‌‌లో మాక్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. కేటాయించిన సెంట‌ర్లకు ప‌రీక్షా ప్రారంభానికి ఒక్క గంట ముందే చేరుకోవాల‌ని, నిమిషం ఆల‌స్యమైనా ప‌రీక్షకు అనుమ‌తించ‌మ‌ని అధికారులు తెలిపారు. మొత్తం 3,97,957 మంది టెట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా 3,83,066 మంది ఆప్షన్లు పెట్టారని, ఆప్షన్లు ఎంచుకున్న వారికి, ఎంచుకొని వారికి దగ్గరలోనే సెంటర్లను కేటాయించామన్నారు. ఆప్షన్లు పెట్టుకోవాలని మే 24 నుంచి 30 వరకు అభ్యర్థుల ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపామని తెలిపారు. తమిళనాడులో 2, హైదరాబాద్‌లో 6, బెంగళూరులో 4 పరీక్షా కేంద్రాలను కేటాయించామన్నారు.

హాల్ టికెట్ డౌన్‌లోడ్:

దశ1: అధికారిక వెబ్ సైట్ aptet.apcfss.inను సందర్శించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
దశ 2: డౌన్‌లోడ్ హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయండి.
దశ3: రెఫరెన్స్ ఐడీ లేదా మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయండి.
దశ 4: సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.  
దశ 5: హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close