టీడీపీ ఎంపీల నిరసనలతో దద్దరిల్లిన లోక్‌సభ.. సభ మార్చి 5కి వాయిదా..

టీడీపీ ఎంపీల నిరసనల హోరుతో లోక్‌సభ, రాజ్యసభల్లో మరోమారు అలజడి చెలరేగింది. 

Updated: Feb 10, 2018, 12:09 AM IST
టీడీపీ ఎంపీల నిరసనలతో దద్దరిల్లిన లోక్‌సభ.. సభ మార్చి 5కి వాయిదా..
Source: Facebook/Kinjarapu Rama Mohan Naidu

టీడీపీ ఎంపీల నిరసనల హోరుతో లోక్‌సభ, రాజ్యసభల్లో మరోమారు అలజడి చెలరేగింది. వరుస నినాదాలు, నిరసనలతో హోరెత్తిన పార్లమెంటును నడపలేక స్పీకరు లోక్‌సభను  మార్చి 5 వరకు వాయిదా వేశారు.

అలాగే రాజ్యసభను కూడా శుక్రవారం సాయంత్రం 2-30 గంటల వరకు వాయిదా వేశారు.  ఈ క్రమంలో పలువురు ఎంపీలు మీడియాతో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. టీడీపీ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన చాలా అసంతృప్తికి గురిచేసిందని అన్నారు.

ఏపీ ప్రజల ఆవేదన రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా తెలుసని ఆయన అన్నారు. మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్‌‌కు పట్టిన గతే బీజేపీకి పట్టకుండా ఉండాలంటే... కేంద్రం ఏపీ ప్రజల బాధను అర్థం చేసుకొని సాధ్యమైనంత త్వరగా స్పందించి సమస్యలు తీర్చాలన్నారు.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close