చంద్రబాబు నాయుడు వద్ద ఉండలేకే వైఎస్ జగన్ వద్దకొచ్చాను : మేడా మల్లిఖార్జున రెడ్డి

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆగ్రహానికి గురైన ఆ పార్టీ ఎమ్మెల్యే మేజా మల్లిఖార్జున రెడ్డి ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని కలిశారు.

Last Updated : Jan 22, 2019, 06:41 PM IST
చంద్రబాబు నాయుడు వద్ద ఉండలేకే వైఎస్ జగన్ వద్దకొచ్చాను : మేడా మల్లిఖార్జున రెడ్డి

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆగ్రహానికి గురైన ఆ పార్టీ ఎమ్మెల్యే మేజా మల్లిఖార్జున రెడ్డి ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ని కలిశారు. జగన్‌తో భేటీ అనంతరం మేడా మల్లిఖార్జున రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''నారా చంద్రబాబు నాయుడి గారి గంజాయి వనం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తులసి వనంలోకి వచ్చినంత ఆనందంగా ఉంది'' అని అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పేదొకటి, ఆయన చేసేదొకటి. ఇంకా ఆయన కళ్లబొల్లి మాటలు నమ్ముతూ అక్కడ ఉండలేకే ఇవాళ తాను వైఎస్ జగన్ మోహన్ వద్దకు వచ్చానని మేడా తెలిపారు. డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ మాటలు నిలబెట్టుకోలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్న మాటను నిజం చేసుకోలేదు. అలా ఎన్నో వర్గాలకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోలేదు. అందుకే ఇంకా ఆయన వద్ద ఉండలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని మేడా మీడియాకు వెల్లడించారు.

టికెట్ ఇస్తారా అనే ప్రశ్నకు స్పందించిన మేడా మల్లిఖార్జున రెడ్డి:
ఈరోజే పార్టీ సభ్యత్వ పదవికి, పార్టీ విప్ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. రేపు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తూ స్పీకర్ కి లేఖ అందజేయడం జరుగుతుందన్న మేడా మల్లిఖార్జున రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి ఆ పార్టీలో చేరడం జరుగుతోంది. ఆయన ఎలా ఆదేశిస్తే, అలా నడుచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. 

Trending News