టాలీవుడ్ పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై స్పందించకుండా తెలుగు సినీ పరిశ్రమ మౌనం వహిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు

Last Updated : Mar 20, 2018, 05:43 PM IST
టాలీవుడ్ పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు

తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, ఏపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశంపై స్పందించకుండా తెలుగు సినీ పరిశ్రమ మౌనం వహిస్తోంది అంటూ రాజేంద్ర ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ప్రత్యేక హోదా కోసం గళమెత్తుతోంటే, తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తూ సమస్యకు దూరంగా వుంటోంది అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమిళనాడులో జల్లికట్టు అంశంపై వివాదం ఏర్పడినప్పుడు తమిళ సినీనటులు అంతా ముందుకొచ్చి పోరాడినట్టుగా, ప్రత్యేక హోదా కోసం ముందుకొచ్చి పోరాడేంత దమ్ము, గుండె ధైర్యం తెలుగు సినీ ప్రముఖులకు లేదు అని రాజేంద్ర ప్రసాద్ కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు.

తమిళ సినీ ప్రముఖులని చూసి తెలుగు సినీ ప్రముఖులు నేర్చోకావాల్సింది ఎంతో వుంది. ప్రత్యేక హోదాకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతు పలకకపోతే, ఆంధ్రులే వారి సినిమాలను బాయ్‌‌కాట్ చేసి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారు అని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.

Trending News