కిడ్నాప్‌కు గురైన తెలుగు ఇంజనీర్ హత్య

ఛత్తీస్‌గఢ్‌-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దులో కిడ్నాప్ కు గురైన తెలుగు ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యారు. సుకుమా జిల్లా పైదగూడ దగ్గర  బాలనాగేశ్వరరావు అనే ఇంజినీర్ ను, మరో ముగ్గురు కార్మికులను మావోయిస్టులు మూడు రోజుల కిందట(ఏప్రిల్ 14) కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ చేసిన రోజునే మావోయిస్టులు ముగ్గురు కార్మికులను వదిలిపెట్టారు. అయితే ఇంజినీర్ బాలనాగేశ్వరావును మాత్రం తమ అధీనంలోనే ఉంచుకున్న మావోయిస్టులు నిన్న రాత్రి ఆయనను హత్య చేశారు.

కాగా, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బాలనాగేశ్వరరావు సుకుమా జిల్లా పైదగూడ వద్ద రోడ్డు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. ఆయన మరణవార్త తెలియడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

English Title: 
telugu engineer killed maoists in chhattisgarh
News Source: 
Home Title: 

కిడ్నాప్‌కు గురైన తెలుగు ఇంజనీర్ హత్య

కిడ్నాప్‌కు గురైన తెలుగు ఇంజనీర్ హత్య
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
కిడ్నాప్‌కు గురైన తెలుగు ఇంజనీర్ హత్య