టీఆర్ఎస్ గెలుపుతో వైసీపీలో సమరోత్సాహం..ఎలగెలగెలగా..?

తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపుతో ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేరంగా మారుతున్నాయి

Last Updated : Dec 13, 2018, 08:51 PM IST
టీఆర్ఎస్ గెలుపుతో వైసీపీలో సమరోత్సాహం..ఎలగెలగెలగా..?

టీఆర్ఎస్ గెలుపుతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సహం నెలకొంది. టీఆర్ఎస్, తెలంగాణ ఎన్నికలతో వైసీపీకి సంబంధమేంటి అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది కదూ.. అయితే దీని గురించి తెలుసుకోవాలంటే వివారాల్లోకి వెళ్లాల్సిందే

టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం
తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ప్రజాకూటమి ఘోరమైన ఓటమి చవిచూసింది. అందులో భాగస్వామిగా ఉన్న టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేసింది. అయితే దక్కింది రెండే రెండు సీట్లు. దీంతో టీడీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. శత్రువు ఓటమి..ప్రత్యర్ధి వర్గానికి గెలుపుతో సమాజామనే కదా. అందుకే తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపు వైసీపీలో సమరోత్సహన్నిస్తోంది

టీడీపీ,కాంగ్రెస్ ఫార్ములా విఫలం
తెలంగాణలో ప్రజాకూటమి పేరుతో టీడీపీ,కాంగ్రెస్ కలిసిపోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుపార్టీల ఫార్ములా దారుణంగా విఫలమైంది. ఒక వేళ ఇది గనుక సక్సెస్ అయితే ఏపీలో టీడీపీకి సానుకూల వాతావరణం నెలకొనేది...అప్పుడు ఈ పరిణామం వైసీపీకి ప్రతికూలంగా మారుతుంది..కానీ టీడీపీ-కాంగ్రెస్ ఫార్మాల సక్సెస్ కాలేదు.. అందుకే తాజా పరిణామంపై  వైసీపీ లోలోపల సంబరపడుతోంది.

వైసీపీ చేతికి సరికొత్త అస్త్రం
టీడీపీ - కాంగ్రెస్ జట్టుగా ఏపీలో కూడా ఎన్నికల బరిలోకి దిగాలనే ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో వీరి ఫార్ములా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఇదే అంశాన్ని వైసీపీ ప్రచార అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. వైగా తెలంగాణలో టీడీపీ ఓటమిని వేలెత్తి చూపిస్తూ చంద్రబాబుకు ప్రజాదరణ లేదని విమర్శలు చేసే అవకాశం దొరికింది. ఇలా తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్ ఓటమి వైసీపీకి బాగా కలిసి వచ్చిందిని చెప్పవచ్చు. దీన్ని వైసీపీ ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

Trending News