ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ :  నేడు రెండో విడత జాబితా రిలీజ్

                     

Last Updated : Oct 15, 2018, 11:27 AM IST
ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ :  నేడు రెండో విడత జాబితా రిలీజ్

విజయవాడ: రాజీవ్ గాంధీ  వైజ్ఞానిక, సాంకేతిక వర్శిటీ (RGUKT) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత ప్రవేశాల జాబితా ఈ రోజు విడుదల కానుంది. మొత్తం 800 పైగా సీట్ల భర్తీ కోసం మెరిట్ ఆధారంగా ఎంపికైన విద్యార్ధుల వివరాలను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా RGUKT అడ్మిషన్ కన్వీనర్ డాక్టర్ గోపాల రాజు మీడియాతో మాట్లాడుతూ ప్రవేశాలకు అర్హత పొందిన వారి జాబితాను వర్శిటీకి సంబంధించిన వెబ్ సైట్ లో చూసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే అర్హత సాధించిన విద్యార్ధులకు ఈమెయిల్, ఎంఎంఎస్ ల ద్వార వక్తిగతంగా సమాచారం ఇస్తామని తెలిపారు. నూజివీడు , శ్రీకాకుళం త్రిపుల్ ఐటీలకు ఎంపికైన వారికి ఈ నెల 24న నూజివీడులో ఆడ్మిషన్స్ ఉంటాయన్నారు. అలాగే  ఒంగోలు,  ఇడుపులపాయ త్రిపుల్ ఐటీలో ఎంపికైన వారికి అదే రోజు ఇడుపులపాయలో ప్రవేశాలు కల్పిస్తామని ప్రకటించారు. 

ఏపీకి చెందిన నూజివీడు, శ్రీకాకుళం, ఇడుపులపాయ, ఒంగోలు  ట్రిపుల్ ఐటీల్లో తొలి విడతగా జూలైలో 4 వేల అడ్మిషన్స్ జరిగాయి. రెండో విడతగా మిగులు సీట్లు ప్రత్యేక కేటరిగిల అభ్యర్ధుల పేర్లు ప్రకటించి భర్తీ చేయాల్సి ఉంది. కోర్టు కేసు కారణంగా రెండో విడత ప్రవేశాల్లో కొంత జాప్యం జరిగింది.  ప్రభుత్వ పాఠశాల్లో పదోతగరతి పూర్తి చేసిన వారికి వెనుకబాటు సూచికింద 0.4 అదనపు జీపీఏ కలిపే అంశంపై  ఓ విద్యార్ధిని హైకోర్టును ఆశ్రయించడంతో రెండో విడత ప్రవేశాలు నిలిచిపోయాయి. ఈ పిటిషన్ ను నాలుగు రోజుల క్రితం హైకోర్టు కొట్టివేయడంతో రెండో విడత ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉండగా రెండో విడత ప్రవేశాలు పొందిన విద్యార్ధులకు నవంబర్ 1 నుంచి తరగతులు నిర్వహించనున్నారు.

Trending News