రహదారి భద్రతకు హిజ్రాలే అంబాసిడర్స్

రహదారి భద్రతలో హిజ్రాలను(ట్రాన్స్ జెండర్స్) ప్రచారకర్తలుగా వినియోగిస్తామని కర్నూలు ఎస్పీ గోపినాథ్ జట్టి అన్నారు.

Updated: Jan 1, 2018, 05:43 PM IST
రహదారి భద్రతకు హిజ్రాలే అంబాసిడర్స్

రహదారి భద్రతలో హిజ్రాలను(ట్రాన్స్ జెండర్స్) ప్రచారకర్తలుగా వినియోగిస్తామని కర్నూలు ఎస్పీ గోపినాథ్ జట్టి అన్నారు. కర్నూలు ఆర్టీసీ బస్ స్టాండ్ లో స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ కర్నూలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ ట్రాన్స్ జెండర్స్ తో కలిసి ఎస్పీ ముళ్లకంపలను, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. 

కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ రాయాలసీమలోనే పెద్దది. దీని చుట్టూ ముళ్లకంపలు, మురికి ఎక్కువగా ఉంది. సరైనా లైటింగ్ సౌకర్యం కూడా లేదు. ఆ చీకటిలో అనేక అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది. అందుకే లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులతో కలిసి బస్ స్టాండ్ పరిసరాలను శుభ్రం చేసాము. చుట్టూ సీసీటీవీ కెమెరాలను పెట్టాము. ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తాం" అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ హిజ్రాలను రోడ్డు భద్రతలో బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉపయోగిస్తామని చెప్పారు.

మునిసిపల్ కమిషనర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ- మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే నినాదంతో కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ ను పరిశుభ్రం చేస్తున్నామని..ఇలానే రైల్వే స్టేషన్, రైతు బజార్లు, స్టేషన్లు, మార్కెట్ యార్డుల్లో కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.