బిగ్ బీ, షారుఖ్, సల్మాన్ ఖాన్‌లకి అమీర్ ఖాన్ 'ప్యాడ్‌మన్ ఛాలెంజ్'

అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకి ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా సవాల్ చేశాడు అమీర్ ఖాన్.

Last Updated : Feb 3, 2018, 01:01 AM IST
బిగ్ బీ, షారుఖ్, సల్మాన్ ఖాన్‌లకి అమీర్ ఖాన్ 'ప్యాడ్‌మన్ ఛాలెంజ్'

శానిటరీ ప్యాడ్‌తో ఫోజ్ ఇవ్వాల్సిందిగా అక్షయ్ కుమార్ భార్య, ప్రముఖ బాలీవుడ్ నటి ట్వింఖిల్ ఖన్నా తనకు చేసిన 'ప్యాడ్‌మన్ ఛాలెంజ్‌'ని స్వీకరించిన అమీర్ ఖాన్.. తాను ఓ శానిటరీ న్యాప్‌కిన్ పట్టుకుని కెమెరాకు ఫోజిచ్చిన ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. మహిళల్లో నెలసరి సమస్య సహజమేనని, ఇందులో నామూషీగా భావించాల్సింది ఏమీ లేదని ట్వింఖిల్ ఖన్నా తనకు పంపించిన ట్వీట్‌ని అదే విధంగా కాపీ పేస్ట్ చేశాడు అమీర్ ఖాన్. ప్యాడ్‌మన్ ఛాలెంజ్ స్వీకరించిన అనంతరం తాను కూడా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకి ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా సవాల్ చేశాడు అమీర్ ఖాన్.

 

అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న అప్‌కమింగ్ సినిమా 'ప్యాడ్‌మన్' ప్రమోషన్స్‌లో భాగంగా మొదలైన ఛాలెంజే ఈ ప్యాడ్‌మన్ ఛాలెంజ్. తమిళనాడులోని ఓ మారుమూల గ్రామంలో అతి తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్‌ని రూపొందించడం మొదలుపెట్టి, తనకు తెలిసిన ఆ విద్యను యావత్ భారతావనికి తెలియచెప్పే ఉద్యమానికి నడుం బిగించిన అరుణాచల్ మురుగంతం అనే వ్యక్తి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమానే ఈ ప్యాడ్‌మన్. 

 

తన రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమాను తాను ప్రమోట్ చేసుకోవడంలో భాగంగా మురుగ మొదట ట్వింఖిల్ ఖన్నాకు ఈ ఛాలెంజ్ చేశాడు. మురుగ చేసిన ప్యాడ్‌మన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన ట్వింఖిల్ ఖన్నా.. అతడు చెప్పినట్టుగానే శానిటరీ ప్యాడ్‌తో ఫోటోకి ఫోజివ్వడమే కాకుండా ఆమె అమీర్ ఖాన్‌ని ఆ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా కోరింది. 

Trending News