ప్రియ ప్రకాశ్ వారియర్ కన్నా ముందే అమ్రపాలి ఆ పనిచేసిందట!

మళయాళం సినిమాలో హీరోను చూసి హీరోయిన్ ప్రియ ప్రకాశ్ వారియర్ కన్ను కొట్టిన వీడియో ఓవర్ నైట్‌లో ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది

Updated: Apr 13, 2018, 10:04 AM IST
ప్రియ ప్రకాశ్ వారియర్ కన్నా ముందే అమ్రపాలి ఆ పనిచేసిందట!

మళయాళం సినిమాలో హీరోను చూసి హీరోయిన్ కన్ను కొట్టిన వీడియో రిలీజయ్యాకా ఆ సినిమా హీరోయిన్‌గా నటించిన ప్రియ ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్‌లో ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆ వీడియో ఓ పెను సంచలనమే సృష్టించింది. ఇండియాలో ప్రియ ప్రకాశ్ వారియర్‌కి వున్న క్రేజ్ చూసి అంతర్జాతీయ మీడియా సైతం ఆమెపై ఫోకస్ చేసిన రోజులు అవి. అయితే, ప్రియ ప్రకాశ్ వారియర్ కన్నా మూడేళ్లు ముందుగానే బోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్ ఇలాగే కన్ను కొట్టింది కానీ అది అంతగా ప్రాచుర్యం పొందలేదు అంటూ సోషల్ మీడియాలో ఓ సరికొత్త ప్రచారం ఊపందుకుంది. ఆమె పేరే అమ్రపాలి దూబే. బోజ్‌పురి పరిశ్రమలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న నటి ఆమె. టెలివిజన్ పరిశ్రమలో కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన అమ్రపాలి దూబే 2015లో రాజ బాబు అనే సినిమాలో నటించింది. ఆ ఏడాదిలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాలోని "మాతా ఫెయిల్ హో గెయిల్" అనే పాటలో నటుడు దినేష్ లాల్‌కి అమ్రపాలి కన్నుకొట్టిన తీరు కూడా అప్పట్లో బోజ్‌పురి ఆడియెన్స్ గుండెల్ని మెలిక పెట్టింది. కుర్రకారుకి కంటిమీద కునుకు కరువయ్యేలా చేసింది. 

 

via GIPHY

ఆ సినిమాలో అమ్రపాలి కన్ను కొట్టిన తీరు కూడా ప్రియ ప్రకాశ్ వారియర్ లాగే మిస్ కాకూడని వీడియో అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను ప్రమోట్ చేస్తున్నారు అమ్రపాలి అభిమానులు. దీంతో అమ్రపాలితోపాటు బోజ్‌పురి సినీ పరిశ్రమ కూడా వార్తల్లో నిలిచింది. అయితే, ఈ రెండు వీడియోలు చూసిన అభిమానులు మాత్రం ప్రియ ప్రకాశ్ వారియర్‌తో అమ్రపాలిని పోల్చలేమని అంటున్నారు. ప్రియ ప్రకాశ్ వారియర్ వీడియో చూస్తే, పదహారేళ్ల ప్రాయంలో రొమాంటిక్ గా కన్నుకొట్టిన పడుచు పిల్లలా వుంటే, అమ్రపాలి దూబే కన్నుకొట్టిన విధానం మాత్రం అందుకు కొంత భిన్నంగా వుందంటున్నారు కేరళ కుట్టి అభిమానులు.

 

via GIPHY