ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కి 29 ఏళ్ల కొడుకు వున్నాడా ?

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ బచ్చన్-అభిషేక్ బచ్చన్‌ల జంటకు వుంది ఒకే ఒక్క గారాలపట్టి ఆరాధ్య. అప్పుడప్పుడు అభిషేక్, ఐశ్వర్య, అమితాబ్‌లతో సెల్ఫీలు తీసుసుకుంటూ కనిపించే ఆరాధ్య ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం తెలిసిందే. కానీ ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కి ఆరాధ్యతోపాటు మరో కొడుకు కూడా వున్నాడు.. ఆ తనయుడు ఇంకెవరో కాదు.. నేనే అంటున్నాడు విశాఖపట్నంకు చెందిన ఓ 29 ఏళ్ల కుర్రాడు. పింక్ విల్లా ప్రచురించిన ఓ కథనం ప్రకారం.. ఐశ్వర్యనే తన తల్లి అని చెప్పుకుంటున్న సంగీత్ కుమార్, టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ద్వారా ఆమె తనకు జన్మనిచ్చింది అని ఆరోపించాడు. 

1988లో లండన్‌లో పుట్టిన తనని ఐశ్వర్యరాయ్ తల్లిదండ్రులు బృంద, కృష్ణరాయ్‌లే పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత తన తండ్రి వైజాగ్‌కి తీసుకొచ్చాడని, అప్పటి నుంచి ఇక్కడే వుంటున్నానని సంగీత్ కుమార్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఐశ్వర్యరాయ్ తన తల్లి అని చెప్పుకోవడానికి బలమైన ఆధారాలు ఏవీ చూపించలేకపోయిన సంగీత్ కుమార్.. కీలకమైన ఆధారాలు నాశనం అవడానికి తన బంధువులే కారణం అని స్పష్టంచేసినట్టు సమాచారం. తన పరువు-ప్రతిష్టలు భంగం కలిగించేలా వున్న ఈ కుర్రాడి వాదనపై ఐశ్వర్యా రాయ్ బచ్చన్ నవ్వేసి ఊరుకుంటుందా లేక ఏమైనా స్పందిస్తుందా అనేది వేచిచూడాల్సిందే మరి!!.

English Title: 
Andhra man claims Aishwarya Rai Bachchan is his mother
News Source: 
Home Title: 

ఐశ్వర్యరాయ్‌కి 29 ఏళ్ల కొడుకు వున్నాడా ?

ఐశ్వర్యరాయ్ బచ్చన్‌కి 29 ఏళ్ల కొడుకు వున్నాడా ?
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes