అను బేబి వీడియో సాంగ్.. శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ ట్రాక్ విడుదల

శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ ట్రాక్ అను బేబి వీడియో సాంగ్

Updated: Aug 10, 2018, 05:54 PM IST
అను బేబి వీడియో సాంగ్.. శైలజా రెడ్డి అల్లుడు ఫస్ట్ ట్రాక్ విడుదల
Youtube | Aditya Music

నాగచైతన్య అప్‌కమింగ్ ప్రాజెక్ట్ శైలజా రెడ్డి అల్లుడు సినిమా మేకర్స్ ముందస్తుగా ప్రకటించిన విధంగానే ఇవాళ ఉదయం సినిమాలోని అను బేబీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. సరిగ్గా 1 నిమిషం నిడివి కలిగిన ఈ వీడియో సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేదిగానే ఉంది. చైతూ సరసన అను ఎమ్మాన్యుయెల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ చైతూకి అత్త పాత్రలో శైలజా రెడ్డిగా కనిపించనున్నారు. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది. ఈ నెలాఖరున సినిమా రిలీజ్ కానుండగా 18వ తేదీన ఆడియో లాంచింగ్ ఫంక్షన్ జరుపుకునేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, అంతకన్నా ముందుగా కృష్ణకాంత్ రాసిన లిరిక్స్‌కి గోపీ సుందర్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఎలా ఉందో తెలియాలంటే శైలజా రెడ్డి అల్లుడు నుంచి ఈ ఫస్ట్ సింగిల్ ట్రాక్ వినాల్సిందే.

 

సూర్యదేవర నాగవంశి, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు.