మహేష్ కత్తిపై బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫైర్

Updated: Jan 13, 2018, 01:18 PM IST
మహేష్ కత్తిపై బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫైర్
Source: Twitter

సినీ క్రిటిక్ మహేష్ కత్తిపై బాలకృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బాలయ్య బాబు నటించిన లేటెస్ట్ సినిమా 'జై సంహ'కు మహేష్ కత్తి నెగటివ్ రివ్యూ రాయడంపై బాలయ్య బాబు అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జై సింహ సినిమా విడుదల కన్నా ఒక రోజు ముందే ట్విటర్ ద్వారా మహేష్ కత్తి రాసినట్టుగా వున్న ఓ ట్విటర్ పోస్టు బాలకృష్ణ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ పోస్టుపై స్పందించిన బాలకృష్ణ అభిమానులు.. మహేష్ కత్తిపై రకరకాల కామెంట్స్ రూపంలో తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.

 

ఇదిలావుంటే, జనవరి 16న తాను మరిన్ని విషయాలని వెల్లడిస్తానన్నట్టుగా మహేష్ కత్తి చేసిన మరో సోషల్ మీడియా పోస్ట్ సైతం ప్రస్తుతం అతడిని వార్తల్లో వ్యక్తిని చేస్తోంది. ఆ రోజు మహేష్ కత్తి వెల్లడించబోయే ఆ రహస్యం ఏంటనే చర్చలు కూడా సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మరి నెటిజెన్స్ సస్పెన్స్ కి మహేష్ కత్తి ఏ విధంగా తెర దించుతాడో తెలియాలంటే ఆరోజు వరకు వెయిట్ చేయక తప్పదు.