'అజ్ఞాతవాసి'కి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం 'అజ్ఞాతవాసి' విడుదల హడావిడిలో బిజీగా ఉన్నారు. ఇటీవల సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు కూడా సినిమా హిట్ అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 

Updated: Jan 8, 2018, 01:13 PM IST
'అజ్ఞాతవాసి'కి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రం 'అజ్ఞాతవాసి' విడుదల హడావిడిలో బిజీగా ఉన్నారు. ఇటీవలే సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులు కూడా సినిమా హిట్ అని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. 

ఇంతలో, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. 'అజ్ఞాతవాసి' సినిమాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనల కోసం అనుమతి మంజూరు చేసింది. తెల్లవారుఝామున 1 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు స్పెషల్ షోలు ప్రదర్శించవచ్చని పేర్కొంది. 

ప్రభుత్వం రోజుకు ఏడు షోలు ప్రదర్శించవచ్చని తెలిపింది. ఈ ప్రత్యేక అనుమతి జనవరి 10 నుండి జనవరి 17 వరకు అమలులో ఉంటుంది. కాగా ఈ అనుమతి కేవలం అజ్ఞాతవాసి సినిమాకు మాత్రమే వర్తించనుంది. ఈ నిర్ణయంపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.