"మెహబూబా" సినిమా టీజర్ విడుదల

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఆయన కొడుకు ఆకాశ్‌ పూరీ నటిస్తున్న సినిమా ‘మెహబూబా'.

Updated: Feb 9, 2018, 12:19 PM IST
"మెహబూబా" సినిమా టీజర్ విడుదల

టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ఆయన కొడుకు ఆకాశ్‌ పూరీ నటిస్తున్న సినిమా ‘మెహబూబా'. కన్నడ నటి నేహాశెట్టి ఈ సినిమాలో హీరోయిన్. ఇటీవలే ఈ చిత్రం టీజర్  విడుదలైంది.

1971లో జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీని తెరకెక్కించారు పూరీ జగన్నాధ్.  2015లో వచ్చిన ‘ఆంధ్రాపోరీ’ సినిమాతో ఆకాష్ పూరీ  హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. గతంలో తను "ధోని" చిత్రంలో బాల నటుడిగా నటించారు.

సంగీత దర్శకుడు సందీప్ చౌతా చాలా రోజుల తర్వాత "మెహబూబా" చిత్రానికి సంగీతం అందించడం విశేషం. ఈ సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానరుపై ఈ చిత్రం నిర్మితమవుతుంది. పూరీ జగన్నాధ్ సతీమణి  లావణ్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.