2 స్టేట్స్ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్ కుమార్తె..?

ప్రముఖ తెలుగు నటుడు డాక్టర్ రాజశేఖర్, జీవితల కుమార్తె శివాని ఓ హిందీ చిత్రం రీమేక్ ద్వారా టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

Updated: Jan 9, 2018, 04:50 PM IST
2 స్టేట్స్ తెలుగు రీమేక్‌లో రాజశేఖర్ కుమార్తె..?
Image Credit : Zee Cinemalu

ప్రముఖ తెలుగు నటుడు డాక్టర్ రాజశేఖర్, జీవితల కుమార్తె శివాని ఓ హిందీ చిత్రం రీమేక్ ద్వారా టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అడవి శేష్ హీరోగా హిందీ చిత్రం "2 స్టేట్స్" రీమేక్‌గా వస్తున్న తెలుగు సినిమాలో శివానీ హీరోయిన్‌గా నటించబోతుందని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. చేతన్ భగత్ రాసిన ప్రముఖ నవల '2 స్టేట్స్' ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రంలో అర్జున్ కపూర్, అలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. తొలుత ఇదే చిత్రాన్ని తెలుగులో నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా తెరకెక్కించాలని భావించారట. అయితే ఎందుకో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం దర్శకుడు వెంకట్ కుంచెం దర్శకత్వంలో ఈ చిత్రం తెలుగులో నిర్మితమవుతుందని.. అందులో హీరోయిన్‌గా శివానిని తీసుకున్నారని మాత్రం టాక్ వస్తోంది.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close