సౌదీలో విడుదల కానున్న తొలి దక్షిణ భారతీయ చిత్రం ఇదే

సౌదీ అరేబియాలో విడుదలయ్యే మొట్టమొదటి దక్షిణ భారతీయ సినిమా ఏదో తెలుసా?

Updated: Jan 3, 2018, 07:11 PM IST
సౌదీలో విడుదల కానున్న తొలి దక్షిణ భారతీయ చిత్రం ఇదే

సౌదీ అరేబియాలో విడుదలయ్యే మొట్టమొదటి దక్షిణ భారతీయ సినిమా ఏదో తెలుసా? అదే 'రోబో 2.ఓ'. సౌదీ అరేబియాలో ఈ ఏడాదినుండి సినిమా థియేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. థియేటర్లు ఏర్పాటయ్యాక తొలి దక్షిణ భారతీయ చిత్రం రజినీకాంత్ నటించిన 'రోబో 2.ఓ' అక్కడ విడుదల కానుంది. ఈ మెగా భారీబడ్జెట్ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. సౌదీ అరేబియా ప్రభుత్వం 1980లో సినిమా థియేటర్లను మూసేసింది. అప్పటి నుండి అక్కడ ఎటువంటి సినిమాలు ప్రదర్శించబడలేదు. 

ఇప్పుడు సౌదీ సర్కార్ థియేటర్లను పునః ప్రారంభించాలని నిర్ణయించింది. మర్చి 2018 నుండి థియేటర్లలో సినిమాలు ప్రదర్శించవచ్చని పేర్కొంది. తమిళ న్యూ ఇయర్ ప్రకారం ఏప్రిల్ 15న  'రోబో 2.ఓ' విడుదల కాబోతుంది.

రోబో 2.ఓ సినిమాలో హీరోగా రజినీకాంత్, హీరోయిన్‌గా అమీ జాక్సన్, విలన్‌గా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమా డైరెక్టర్ శంకర్. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ బ్యానరు‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయాలనుకున్నా.. తమిళ న్యూఇయర్ ఏప్రిల్ 15న విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.