లైవ్ వీడియో: రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరైన అంతరిక్షం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

లైవ్ వీడియో: రామ్ చరణ్ ముఖ్య అతిథిగా అంతరిక్షం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

Last Updated : Dec 19, 2018, 12:55 PM IST
లైవ్ వీడియో: రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరైన అంతరిక్షం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన అంతరిక్షం మూవీ ఈ నెల 21వ తేదీన ఆడియెన్స్ ముందుకొస్తున్న తరుణంలో మంగళవారం ఈ చిత్ర నిర్మాతలు అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి, మరో నిర్మాత రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడితో కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. అంతరిక్షంలో ఓ అద్భుతమైన ప్రయోగం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ ఆస్ట్రోనాట్ పాత్రలో నటించగా అతడి సరసన లావణ్య త్రిపాఠి, అదిథి రావ్ హైదరి ఫీమేల్ లీడ్ రోల్స్ పోషించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో క్రిష్ మాట్లాడుతూ.. సంకల్ప్ రెడ్డి తన కొలిగ్ అని చెప్పుకునేందుకు గర్వంగా ఉందని అన్నారు. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తున్న సంకల్ప్ రెడ్డి అంతరిక్షం సినిమాతో కచ్చితంగా మంచి హిట్ సొంతం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశారు.

Trending News