షూటింగ్‌లో బిజీ.. ఇప్పుడు రాలేను: వర్మ

గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ (జీఎస్‌టీ) చిత్రం తీసి వార్తల్లో నిలిచిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే మహిళా సంఘాల నుండి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

Updated: Feb 9, 2018, 12:23 PM IST
షూటింగ్‌లో బిజీ.. ఇప్పుడు రాలేను: వర్మ

గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌ (జీఎస్‌టీ) చిత్రం తీసి వార్తల్లో నిలిచిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు వ్యతిరేకంగా ఇప్పటికే మహిళా సంఘాల నుండి అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. పోర్న్‌స్టార్‌ మియా మల్కొవాతో వర్మ తెరకెక్కించిన జీఎస్‌టీ చిత్రాన్ని ఇప్పటికే భారతదేశంలో నిషేధించారు. ఈ క్రమంలో పలువురు మహిళా సామాజికవేత్తలను కించపరిచేలా మాట్లాడారని వర్మ పై పలువురు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో భాగంగా గురువారం తమ ఎదుట హాజరు కావాలని హైదరాబాద్‌ పోలీసులు రామ్‌గోపాల్‌వర్మకు నోటీసులు పంపారు. అయితే వర్మ ఆ నోటీసులు తీసుకోవడానికి ఒప్పుకోలేదు. తాను ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌లో బిజీగా ఉన్నానని.. తాను విచారణకు హాజరుకాలేనని తన లాయర్‌ ద్వారా  ఆయన హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. వచ్చే వారం తనకు మళ్లీ నోటీసులు మంజూరు చేస్తే.. ఈ సారి తప్పక వస్తానని వర్మ పోలీసులకు సమాచారం అందించారు.