సమంతకు కోపం తెప్పిస్తే, ఇదిగో ఇలాగే వుంటుంది మరి!!

నెటిజెన్స్‌కి సమంత ఘాటు రిప్లై

Updated: Feb 9, 2018, 04:44 PM IST
సమంతకు కోపం తెప్పిస్తే, ఇదిగో ఇలాగే వుంటుంది మరి!!

2 పీస్ బికినీలో సముద్రపు ఒడ్డున సేదతీరుతున్న ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్న సమంతని దాదాపు వేధించినంత పనిచేశారు నెటిజెన్స్. పెళ్లి అయిన తర్వాత ఇలాంటి ఫోజులు ఏంటని కొందరు నిలదీస్తే.., అక్కినేని వారింటికి కోడలిగా వచ్చిన అమ్మాయి ప్రవర్తించేది ఇలాగేనా అని ఇంకొందరు ఆమెకి సోషల్ మీడియాలో లెక్చర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకరి తర్వాత ఒకరిగా నెటిజెన్స్ ఇస్తున్న క్లాసులతో విసిగిపోయిన సమంత వారికి తనదైన స్టైల్లోనే ఘాటు రిప్లై ఇచ్చింది.

 

"నా చావేదో నేను చస్తాను.. నీకెందుకు" అని పెళ్లిచూపులు సినిమాలో కమెడియన్ ప్రియదర్శిని చెప్పిన ఓ ఫన్నీ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. తనని పరోక్షంగా విమర్శించబోయిన వ్యక్తికి ఆ సినిమాలో ప్రియదర్శిని అంతే పరోక్షంగా చెప్పిన డైలాగ్ అతడికి ఎంత సూటిగా తగిలిందో ఆ సీన్‌లో చూశాం. తాజాగా సమంత కూడా తనని విమర్శించిన విమర్శకులకి అచ్చం అలాగే కాకపోయినా.. ఇంచుమించు అటువంటి సమాధానమే ఇచ్చింది . "నా రూల్స్ నాకు వున్నాయి. మీరు నా గురించి కాకుండా మీ రూల్స్ మీరు చూసుకుంటే బాగుంటుంది" అని సామ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ ఆమెని విమర్శించిన నెటిజెన్స్‌కి గట్టిగానే తాకినట్టుంది.