ధోనీ భార్య సాక్షిని షారుఖ్ హత్తుకున్న వీడియో వైరల్ !

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఏం చేసినా అది ఓ సెన్సేషనే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 

Last Updated : Apr 12, 2018, 05:38 PM IST
ధోనీ భార్య సాక్షిని షారుఖ్ హత్తుకున్న వీడియో వైరల్ !

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఏం చేసినా.. అది ఓ సెన్సేషనే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గతంలో అది అనేక సందర్భాల్లో రుజువైంది కూడా. ఐపీఎల్‌లో తన టీమ్ కోల్‌‌కతా నైట్ రైడర్స్ ఆడే ప్రతీ ఆటకు అందుబాటులో వుండి జట్టును ప్రోత్సహించే షారుఖ్ మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుపై విజయాన్ని దగ్గరుండి ఎంజాయ్ చేశాడు. అలాగే ఆ తర్వాత చెన్నైలో జరిగిన రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఆటను చూసేందుకు చెన్నైకి వచ్చిన షారుఖ్.. అక్కడ తమ ప్రత్యర్థి జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో కలిసి సరదాగా ఆడుకున్నాడు. స్టేడియంలోనే జీవాతో కలిసి కాసేపు టైమ్ పాస్ చేసిన షారుఖ్.. ధోనీ చేతిలో తమ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓటమిపాలైనప్పటికీ, తన స్పోర్టివ్ స్పిరిట్‌ని మాత్రం వీడలేదు. అందుకే ఓటమి భారాన్ని పైకి కనిపించనివ్వకుండానే తమ జట్టుని ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షిని హత్తుకుని ఆమెకు మనస్పూర్తిగా కంగ్రాట్స్ చెప్పాడు షారుఖ్. 

 

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

A post shared by ZIVA SINGH DHONI (@zivasinghdhoni006) on

ధోనీ కూతురు జివాతో షారుఖ్ ఆడుకోవడం, ధోనీ భార్య సాక్షికి అతడు కంగ్రాట్స్ చెప్పిన తీరుని తమ కెమెరాల్లో బంధించిన అభిమానులు ఆ ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఆ ఫోటోలు, వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.

 

Trending News