వైఎస్ జగన్ పాత్రలో నటించనున్న సూర్య ?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తమిళ స్టార్ హీరో సూర్యను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో చూసే అవకాశం అతడి అభిమానులకు రానున్నట్టు తెలుస్తోంది. 

Last Updated : Mar 17, 2018, 05:21 PM IST
వైఎస్ జగన్ పాత్రలో నటించనున్న సూర్య ?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తమిళ స్టార్ హీరో సూర్యను వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో చూసే అవకాశం అతడి అభిమానులకు రానున్నట్టు తెలుస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రియల్ స్టోరీ ఆధారంగా ఓ బయోపిక్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది అనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ పాత్రలో మళయాళం స్టార్ హీరో మమ్ముట్టి కనిపించనున్నారని, 2019 ఎన్నికలకన్నా ముందుగా ఈ సినిమా రిలీజ్ కానుందనేది ఆ టాక్ సారాంశం. అయితే టాలీవుడ్ వర్గాల లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ బయోపిక్ సినిమాలో నటుడు సూర్య, వైఎస్ జగన్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. భారతి సిమెంట్స్‌కి బ్రాండ్ అంబాసిడర్ అయిన సూర్యకు, వైఎస్ జగన్‌కి మధ్య మంచి అనుబంధం వుంది. ఈ అనుబంధమే ఇప్పుడు ఏకంగా సూర్యకు జగన్ పాత్ర పోషించే అవకాశం సొంతం చేసుకునేలా చేసిందంటున్నాయి సినీవర్గాలు.

ఇటీవల వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టిన సందర్భంలోనూ జగన్ పాదయాత్ర సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్టు ప్రకటించి అతడిపట్ల తనకు వున్న అభిమానాన్ని చాటుకున్నాడు సూర్య. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించనుండగా, అతడి సతీమణి విజయమ్మ పాత్రలో నయనతారను ఎంపిక చేసుకున్నట్టు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  విజయ్ జల్ల, శశిదేవర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు సమాచారం.

Trending News