ఎంత సక్కగున్నావే లచ్చిమి.. ఎంత సక్కగున్నావే..

4 నిమిషాల 24 సెకన్ల నిడివిగల ఈ పాటను స్వయంగా డీఎస్పీ పాడాడు

Updated: Feb 13, 2018, 09:46 PM IST
ఎంత సక్కగున్నావే లచ్చిమి.. ఎంత సక్కగున్నావే..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, మ్యూజిక్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. సుకుమార్ డైరెక్షన్‌లో చెర్రీ, సమంత జంటగా నటించిన అప్‌కమింగ్ మూవీ రంగస్థలం నుంచి తొలి పాట విడుదలైంది. చంద్రబోస్ రచించిన ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ రంగస్థలం సినిమా పాటల కోసం వేచిచూస్తోన్న అభిమానులు, ఆడియెన్స్‌ని అలరిస్తోంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం. మీరూ ఓ లుక్కేయండి!!

 

"వేరు శనగ కోసం మట్టిని తవ్వితే.. ఏకంగా తగిలిన లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే..
లచ్ఛిమి ఎంత సక్కగున్నావే..
చింత చెట్టు ఎక్కి సిగురు కోయబోతే.. చేతికి అందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావే..
లచ్ఛిమి ఎంత సక్కగున్నావే.." 

చంద్రబోస్ రాసిన లిరిక్స్ అదుర్స్ కదా!! 4 నిమిషాల 24 సెకన్ల నిడివిగల ఈ పాటను స్వయంగా డీఎస్పీ పాడాడు. డీఎస్పీ పాటేసుకుంటే, ఎలా వుంటుందో తెలుసు కదా!! అందుకే రిలీజైన కాసేపట్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తోంది ఈ సాంగ్.