అరుదైన ఫోటోను షేర్ చేసుకున్న అమీర్ ఖాన్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన బర్త్ డే రోజున ఇన్స్టాగ్రామ్  లో తొలిసారి ఓ అరుదైన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Updated: Mar 14, 2018, 02:43 PM IST
అరుదైన ఫోటోను షేర్ చేసుకున్న అమీర్ ఖాన్

న్యూఢిల్లీ: బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తన బర్త్ డే రోజున ఇన్స్టాగ్రామ్  లో తొలిసారి ఓ అరుదైన ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

తొమ్మిది ఫోటో ముక్కలను కలిపి తల్లి ఫోటోను షేర్ చేశారు ఈ దంగల్ వీరుడు. 'ది పర్సన్ బికాస్ ఆఫ్ హూమ్ ఐ యామ్ హూ ఐ యామ్..' అంటూ తల్లిని గుర్తు చేస్తూ ఫోటో కింద రాసి పోస్టు చేశారు.

 

The person because of whom I am who I am...

A post shared by Aamir Khan (@_aamirkhan) on

 

ప్రస్తుతం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' అనే సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కి సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఫాలోవర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మంగళవారం అమీర్  ఇన్స్టాగ్రామ్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో అమీర్ కు 2,36,000మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. బుధవారం నాడు పుట్టినరోజు సందర్భంగా తల్లి ఫోటోను షేర్ చేసుకున్నారు అమీర్. అమీర్ తల్లి పేరు జీనత్  హుస్సేన్. తండ్రి పేరు తాహిర్ హుస్సేన్. తండ్రి సినీ నిర్మాత.