లక్ష్మణఫలం తినడం వల్ల ఉపయోగాలివే

లక్ష్మణఫలం చెట్లు ఎక్కువగా మెక్సికో, క్యూబా, బ్రెజిల్ వంటి దేశాల్లో కనిపిస్తాయి. 

Updated: Sep 7, 2018, 12:04 AM IST
లక్ష్మణఫలం తినడం వల్ల ఉపయోగాలివే
Image Credit: Wikipedia

లక్ష్మణఫలం చెట్లు ఎక్కువగా మెక్సికో, క్యూబా, బ్రెజిల్ వంటి దేశాల్లో కనిపిస్తాయి. కొన్ని శతాబ్దాల నుండి భారతదేశంలోని అటవీ ప్రాంతాల్లో కూడా ఈ చెట్లు కనబడుతున్నాయి. సీతాఫలంలో మాదిరిగానే లక్ష్మణఫలంలో కూడా పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఫలంలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. ఈ వ్యాసంలో లక్ష్మణఫలం వల్ల ఉపయోగాలేమిటో మనం కూడా తెలుసుకుందాం.

*లక్ష్మణఫలాన్ని ఆంగ్లంలో 'ఆనోనా మ్యూరికాటా'  అని అంటారు. లక్ష్మణ ఫలంలో 12 రకాల కేన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 
*లక్ష్మణఫల చెట్టు బెరడును, ఆకులను, విత్తనాలను ఆయుర్వేద వైద్య తయారీలో వాడుతున్నారు. కడుపులో పురుగులను హరించుటకు, విష జ్వరాలను తగ్గించుటకు లక్ష్మణ ఫలాలు బాగా ఉపయోగపడతాయి.
*తలలో పేలను హరించడానికి కూడా ఈ మధ్యకాలంలో లక్ష్మణఫల ఆకులను ముద్దగా చేసి మర్దన చేసుకోవడం జరుగుతోంది.
*పార్శ్వపు నొప్పి, మధుమేహం, మూత్రకోశ వ్యాధుల చికిత్సలో కూడా లక్ష్మణఫలాన్ని వాడుతున్నారు.
*బాలింతల్లో పాలు వృద్ధి చెందడానికి కూడా లక్ష్మణఫలం తగిన ఫలితాన్ని ఇస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
*ఈ పండ్ల గింజలను పొడిచేసి నీళ్ళలో కలిపి రాసుకుంటే కండరాల నొప్పులు తగ్గుతాయని వినికిడి.
*పెద్దగా ఈ చెట్ల గురించి తెలియకపోవడం వల్ల ఎవరూ పెంచడం లేదు. అయితే  విశాఖపట్నం జిల్లా కశింకోటలో ఈ చెట్లను ఈ మధ్యకాలంలో పెంచుతున్నారు. అలాగే విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలలో ఇవి కొన్ని చోట్ల లభిస్తున్నాయి.
*విటమిన్ సి, విటమిన్ బీ1, విటమిన్ బీ2 పుష్కలంగా ఈ ఫలాల్లో లభిస్తుందని పలువురి వైద్యుల అభిప్రాయం.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close