ఎన్టీఆర్ 'అరవింద సమేత' నుంచి పెనివిటి సాంగ్ ప్రోమో రిలీజ్

ఎన్టీఆర్ 'అరవింద సమేత' నుంచి పెనివిటి సాంగ్ ప్రోమో రిలీజ్

Last Updated : Oct 7, 2018, 10:05 AM IST
ఎన్టీఆర్ 'అరవింద సమేత' నుంచి పెనివిటి సాంగ్ ప్రోమో రిలీజ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ఉంటుందని సమాచారం.

ఫ్యాన్స్ కోసం ఈ సినిమా నుంచి రోజుకో అప్డేట్ ఇస్తోంది చిత్ర యూనిట్. నిన్న ‘అనగనగా’ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసిన అరవింద సమేత చిత్ర యూనిట్ .. నేడు 30 సెక‌న్ల నిడివిగల పెనివిటి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. సాయంత్రం 4:50 గంటలకు సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. పెనివిటి సాంగ్ ప్రోమోను మీరూ చూడండి..

 

'అరవింద సమేత'లో అభయ్ రామ్..?

'అరవింద సమేత వీర రాఘవ' చిత్రంలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో కొడుకు అభయ్ రామ్ నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలో నిజమెంతుందో తెలియదు కానీ.. మూవీ యూనిట్ మాత్రం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు కొందరు అంటున్నారు. ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ సినిమాలో ఉంటే తారక్ అభిమానులకు నిజంగా పండగే.. !

అరవింద సమేత షూటింగ్ సమయంలో అభయ్ రామ్ త్రివిక్రమ్ ఒళ్లో కూర్చొని చేత్తో కత్తి పట్టాడు. పక్కనే ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఆ స్టిల్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు అభయ్ రామ్ సినిమాలో ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు.  

ఎన్టీఆర్‌కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తోంది. అక్టోబర్‌ 11న దసరా సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Trending News