భరత్ అనే నేను: 'వచ్చాడయ్యో సామీ' సాంగ్ ప్రొమో రిలీజ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'భ‌ర‌త్ అను నేను' మూవీ ఈ నెల 20వ తేదిని థియేటర్ల ముందుకు రానుంది.

Updated: Apr 18, 2018, 10:14 AM IST
భరత్ అనే నేను: 'వచ్చాడయ్యో సామీ' సాంగ్ ప్రొమో రిలీజ్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'భ‌ర‌త్ అను నేను' మూవీ ఈ నెల 20వ తేదిని థియేటర్ల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. భ‌ర‌త్ అను నేను' చిత్రానికి సోమవారం సెన్సార్‌ పూర్తి కాగా, యూ/ఏ ఇచ్చారు. ఈ క్రమంలో ఈ మూవీలోని 'వచ్చాడయ్యో సామీ' సాంగ్ ప్రొమోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సాంగ్ ను మ‌హేష్ తో చిత్రీక‌రించారు. రామ‌జోగ‌య్య రాసిన ఈ గీతాన్ని కైలాష్ ఖేర్, దివ్య కుమార్ లు పాడారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు స‌మ‌కూర్చాడు..

మహేశ్ తో శ్రీ‌మంతుడు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తీసిన దర్శకుడు కొర‌టాల శివ, ఈ మూవీ ద్వారా కైరా అద్వానిని టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం చేయనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, దేవరాజ్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.  తాజాగా విడుద‌లైన సాంగ్ ప్రొమోను మీరూ చూడండి.

'భ‌ర‌త్ అను నేను' సినిమా విడుదలకు భారీగా సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. మొత్తం 320కిపైగా లొకేషన్లలో సినిమాను ప్రదర్శించనున్నారని సమాచారం. 2000లకుపైగా స్క్రీన్లలో చిత్రం ప్రీమియర్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close