బయోపిక్స్ రియల్ హీరోల మీద తీయండి.. రీల్ హీరోల మీద కాదు: అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దర్శకులు నిజ జీవితంలో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తుల మీద బయోపిక్స్ తెరకెక్కించాలి తప్పితే.. సినిమా హీరోల జీవితాలను తెరకెక్కించకూడదని ఆయన తెలిపారు. 

Last Updated : Jul 30, 2018, 02:32 PM IST
బయోపిక్స్ రియల్ హీరోల మీద తీయండి.. రీల్ హీరోల మీద కాదు: అక్షయ్ కుమార్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దర్శకులు నిజ జీవితంలో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తుల మీద బయోపిక్స్ తెరకెక్కించాలి తప్పితే.. సినిమా హీరోల జీవితాలను తెరకెక్కించకూడదని ఆయన తెలిపారు. ఇటీవలే రాజ్ కుమార్ హిరానీ సంజయ్ దత్ జీవితాన్ని బయోపిక్ రూపంలో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. "సంజూ" ఇప్పటికే అనేక రికార్డులు కూడా బ్రేక్ చేసింది. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. "నేను నా మీద సినిమా ఎప్పుడు తీసుకోను. అలాగే నా మీద పుస్తకాన్ని కూడా రాయను" అని తెలిపారు.

"చరిత్రలో ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. తపన్ దాస్, అరుణాచల మురుగునాథం లాంటి వారి మీద తీసిన సినిమాలు జనాలను పాజిటివ్ దారి వైపు మళ్లించాయి. నేను నా మీద బయోపిక్ తీసుకుంటే.. నా కంటే పెద్ద ఫుల్ ఎవరూ లేరని నమ్ముతాను. బయోపిక్ సినిమాలు అనేవి రియల్ హీరోల పై తీయాలి తప్పితే.. రీల్ హీరోల మీద కాదు" అని అక్షయ్ కుమార్ తెలిపారు. అక్షయ్ కుమార్ "గోల్డ్" సినిమాలో హాకీ ఆటగాడు తపన్ దాస్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆయన "పద్మన్" చిత్రంలో అరుణాచల మురుగునాథం పాత్ర పోషించారు. 

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ పరిశ్రమ బయోపిక్ చిత్రాలు తీసే దిశగా బాగానే అడుగులు వేస్తోంది. సూపర్ 30, మాంటో, మణికర్ణిక వంటి చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అలాగే నరేంద్ర మోదీ జీవితాన్ని కూడా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు పలువురు దర్శకులు. తెలుగులో కూడా ఎన్టీఆర్ జీవిత చరిత్ర నేపథ్యంలో వస్తున్న బయోపిక్ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే వైఎస్సార్ జీవితకథ నేపథ్యంలో వస్తున్న చిత్రంలో మలయాళ నటుడు ముమ్ముట్టి టైటల్ రోల్ పోషిస్తున్నారు.

Trending News